చైనా దేశంలోని వుహాన్ నుంచి అమెరికా దేశానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని తేలడంతో ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఉత్తర కొరియా చైనా దేశానికి రాకపోకలను నిషేధించింది. కరోనా వైరస్ పలు దేశాల్లో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించే విషయంలో గురువారం నిర్ణయం తీసుకుంటుందని ఆ సంస్థ డైరెక్టరు జనరల్ డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో 9156 మంది ప్రయాణికులను పరీక్షించగా కరోనా వైరస్ కేసులు బయటపడలేదని వైద్యాధికారులు చెప్పారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులుంటే వైద్యపరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు.
అమెరికా దేశాల్లో కొత్త రకం ‘కరోనా వైరస్’ సోకడం వల్ల 17 మంది మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర కమిటీ సమావేశమై ఆ దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ నాలుగు దేశాలకు పాకిందని అందిన సమాచారంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించాలనే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ సభ్యులు చర్చించారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అత్యవసర పరిస్ధితులు నెలకొన్నందు వల్ల దీనిపై ఏం చేయాలనేది గురువారం తమ అత్యవసర కమిటీ నిర్ణయిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. కరోనా వైరస్ ప్రారంభమైన చైనా దేశంలోని వుహాన్ నగరంలో ప్రజల రాకపోకలను నిషేధించారని, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చైనా వైద్యాధికారులు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని డాక్టర్ టెడ్రోస్ వివరించారు.( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment