ఫిబ్రవరి14:పుల్వామా సంఘటనలో అమరులైన జవాన్లకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో నివాళులు అర్పించడం జరిగింది. స్థానిక స్కూల్ కాంప్లెక్స్ వద్ద జరిగిన క్రొవ్వత్తుల ర్యాలీలో అమరులైన జవాన్లకు జోహార్లర్పిస్తూ నినాదాలు చేశారు.జమ్మూ కాశ్మీర్ కు వెళుతున్న సీఆర్పీఎఫ్ జవాన్ల ట్రంకు పై ఉగ్రవాదులు జరిపిన బాంబు ఆత్మాహుతి దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారని మరో ముప్పై అయిదు మంది క్షతగాత్రులయ్యారని ఈ సందర్భముగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం అధ్యక్షులు బూర శ్రీనివాస్ అన్నారు ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు,న్యాత సుధాకర్, ముడికే బాలరాజు, బొడ్డు బాలయ్య,లియో క్లబ్ అధ్యక్షుడు గంట గౌతమ్, లియో లయన్స్ క్లబ్ సభ్యులు దేశరాజ్ శివ సాయి , పాశంసంతోష్, దేశరాజ్ అనిల్ , రాపోలు అనిల్,బోయిని రాజు, మునిగంటి రమేష్,రాపోలు అరవింద్,.కరుణాకర్,కొమురయ్య,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

0/Post a Comment/Comments

Previous Post Next Post