తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరిట 169 మందికి కుచ్చుటోపీ

తెలంగాణ సర్కారు డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఈ స్కీంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడింది. ఈ విషయంలో నకిలీ పత్రాలతో మోసగిస్తున్న ఆ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వలశెట్టి వెంకట వరప్రసాద్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన ఈ ముఠా రూ.2 కోట్ల మేర ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడింది. 169 మంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు దుండిగల్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.1.11 కోట్లు రాబట్టారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post