కేంద్ర బడ్జెట్-2020 ..... బడ్జెట్ వివరాలు ఇవిగో!

కేంద్ర బడ్జెట్ లో భాగంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి రాక, పోకలపై వివరాలు వెల్లడించారు. ఆయా రంగాలకు కేంద్రం ఖర్చు పెడుతున్నది ఎంత, ఆదాయం వస్తున్నది ఎంత అనే వివరాలను సభలో వివరించారు.

కేంద్రం ఖర్చులు (రూపాయి పోక)

 • కేంద్ర ప్రాయోజిక పథకాలు-9 శాతం
 • సబ్సీడీలు- 6 శాతం
 • వడ్డీ చెల్లింపులు- 18 శాతం
 • రాష్ట్రాలకు పన్నుల వాటా- 20 శాతం
 • రక్షణ రంగం- 8 శాతం
 • కేంద్ర పథకాలు- 9 శాతం
 • పింఛన్లు- 6 శాతం
 • ఆర్థికసంఘం, ఇతర కేటాయింపులు- 10 శాతం
 • ఇతర ఖర్చులు- 10 శాతం

కేంద్రానికి ఆదాయం (రూపాయి రాక)

 • రుణాలు- 20 శాతం
 • పన్నేతర ఆదాయం- 10 శాతం
 • కస్టమ్స్ సుంకాలు- 4 శాతం
 • కేంద్ర ఎక్సైజ్ పన్ను- 7 శాతం
 • కార్పొరేట్ ట్యాక్స్- 18 శాతం
 • జీఎస్టీ ఆదాయం- 18 శాతం
 • ఆదాయపు పన్ను- 17 శాతం
 • రుణేతర మూలధన వసూళ్లు- 6 శాతం

0/Post a Comment/Comments

Previous Post Next Post