24 గంటల్లో ఆప్ లో చేరిన 11 లక్షల మంది - ఆప్ కు పెరిగిన క్రేజ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ… ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రికార్డులు సృష్టిస్తోంది. మిస్స్ డ్ కాల్ ఇవ్వండి, పార్టీలో చేరండి అంటూ ఆ పార్టీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 11 లక్షల మందికి పైగా ప్రజలు ఆప్ లో చేరారు. ఈ విషయాన్ని ఆప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. తాము ఘన విజయం సాధించిన 24 గంటల్లోనే మరో ఘనతను సాధించామని ట్వీట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 62 సీట్లను ఆప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

0/Post a Comment/Comments

Previous Post Next Post