సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధం: క్యాట్ ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వరరావు

సస్పెన్షన్ వేటుకు గురైన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. తన సస్పెన్షన్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని పిటిషన్ వేశారు. గత ఏడాది మే నుంచి ఏపీ ప్రభుత్వం తనకు వేతనం కూడా చెల్లించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలతో తనను సస్పెండ్ చేశారని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారని… ఆ ఉత్తర్వులను కొట్టేయాలని పిటిషన్ లో కోరారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post