వేల కోట్ల రూపాయల స్కామ్‌లు ఎలా చేయాలో నేర్చుకోవాలంటే జగన్‌, విజయసాయిరెడ్డి వద్దకు ట్యూషన్‌కు వెళ్లాలి: బుద్ధా వెంకన్న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు చెందిన రూ.43 వేల కోట్లను ఈడీ ఇప్పటికే జప్తు చేసిందని, ఆయనకు ఇంకా బెంగళూరు, ఇడుపులపాయ, తాడేపల్లిలో లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు ఎలా చేయాలో నేర్చుకోవాలంటే జగన్, విజయసాయిరెడ్డి దగ్గర వైసీపీ నేతలు ట్యూషన్ పెట్టించుకోవాలని చురకలంటించారు. దొంగే ‘దొంగ దొంగ’ అని అరుస్తున్నట్లు  వైసీపీ నేతల తీరు ఉందని బుద్ధా వెంకన్న ఎద్దేవా  చేశారు. ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌పై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని చెప్పారు. సూట్ కేసు కంపెనీల్లో జగన్‌.. 43 వేల కోట్లు దాచుకున్నారని, ఇటువంటి వారు టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post