రెచ్చిపోతున్న రేషన్ మాఫియా - చెక్ పెట్టిన పోలీసు వారు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి :ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి రహిత సమాజం కోసం ఒక ప్రక్క పాటుపడుతుంటే కొంత మంది దళారులు పేదోడి బియ్యం స్వాహా చేస్తున్న వైనం. నియోజకవర్గ పరిధిలో కొంతమంది దళారులు ఈ అక్రమ వ్యాపారన్నీ ప్రధాన ఆదాయమార్గంగా ఎంచుకొని కోట్లు కొల్ల గొడదమని చూస్తున్నారు. ఎది ఏమైనా వీరి దందా నియోజకవర్గములో మూడు పువ్వులు ఆరుకాయల్లా సాగుతుందనే చేప్పుకోవచ్చు .ప్రతినెల 1నుండి 15 వరకు ప్రతిరోజులబ్ధిదారులకు అందిచవలసినబియ్యాన్ని కొందమంది సిండికేట్ గా ఏర్పడి రేషన్ డీలర్ల వద్ద నుండి 1రూపాయి బియ్యాన్ని 10 రూపాయలు ఆశచూపి వెచ్చించి తమ స్టాక్ పాయింట్ కు తరలిస్తున్నారు. అక్రమ దందా ను అరికట్టేందుకు సర్కారు పటిష్ట చర్యలు చేపడుతున్న వీరి వ్యాపారం మాత్రం ఆగడంలేదు. ఇటీవల కాలంలో రూరల్ మండలల్లో తనిఖీల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 36 బస్తాలరేషన్ బియ్యాన్ని రూరల్ సిఐ ఆదినారాయణ బృందం పట్టుకొని పట్టణానికి చెందిన నారాయణ మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post