జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సర్వీసు ప్రారంభం - రిబ్బన్ కట్ చేసిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ అన్నా, టీఆర్ఎస్ పార్టీ అన్నా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో మండిపడతాడో అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఈ వైరం కొనసాగుతూనే ఉంది. ఇక కేసీఆర్, రేవంత్ కలిసిన సందర్భాలు అత్యంత అరుదు అనే చెప్పాలి. తాజాగా, జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సర్వీసు ప్రారంభోత్సవంలో కేసీఆర్ పక్కనే రేవంత్ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్ చేస్తుండగా, ఆ వైపు మంత్రి కేటీఆర్, ఈ వైపు రేవంత్ రెడ్డి నిల్చున్నారు. మంత్రి తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ హోదాలో రేవంత్ ను కూడా ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post