అంతర్జాతీయ పప్పుదినుసుల దినోత్సవం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సోమవారం గునుకుల కొండాపూర్, గన్నేరువరం వివిధ గ్రామంలో అంతర్జాతీయ పప్పుదినుసులు దినోత్సవం సందర్భంగా పప్పు దినుసుల వంటల క్షేత్రత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి కె.వి.కె శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పప్పు దినుసుల వినియోగం చాలా తక్కువ ఉన్నందున అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అందరు రైతులు వివిధ రకాల పప్పు దినుసులు పంటల సాగు చేయాలని అన్నారు మనిషికి కావాల్సిన మాంసకృత్తులు ఒక పప్పు దినుసుల్లో మాత్రమే ఉంటుందని అన్నారు పప్పు దినుసులు ఆహార పదార్థాల వినియోగం పెరగాలని తెలిపారు వివిధ పప్పుదినుసులు పంటల్లో సాగు వివరాలు సస్యరక్షణ చర్యలు రైతులకు తెలిపారు అనంతరం 2020 సంవత్సర క్యాలెండర్ రైతుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎడిఎ అంజని, శిక్షణ బి శ్రీనివాస్ కరీంనగర్ సహాయ వ్యవసాయ సంచాలకులు మానకొండూర్ మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post