బీజేపీ, కాంగ్రెస్‌లకు ఝలక్‌ ఇచ్చిన ఢిల్లీ ఓటర్లు

భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ ప్రముఖులకు ఢిల్లీ ఓటర్లు ఝలక్‌ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ప్రముఖులు పలువురు ఓటమి దిశగా ప్రయాణిస్తున్నారు. వరుసగా రెండుసార్లు అధికారం నెరపిన ఈ విషయంలో ఆప్‌ ప్రముఖులకు కాస్త ఊరటనిచ్చారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఆప్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఆల్కాలంబాను చాందినీచౌక్‌ ఓటర్లు కంగుతినిపించారు. అలాగే, మంగోలిపురం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ లిలోథియా, పటేల్‌ నగర్‌ నుంచి పోటీ చేసిన కృష్ణతీర్థ, సంగం విహార్‌ నుంచి పోటీ చేసిన పూనం అజాద్‌ ఓటమి దిశగా ప్రయాణిస్తున్నారు. అలాగే బీజేపీకి చెందిన విజేందర్‌ గుప్తా రోహిణిలో, రాజీవ్‌బబ్బర్‌ తిలక్‌నగర్‌లో, తాజిందర్‌సింగ్‌ బగ్గా హరినగర్‌లో ఓటమి అంచుకు చేరుకున్నారు. ఇక హాట్రిక్‌ దిశగా అధికారం సాధించేందుకు పరుగులు పెడుతున్న ఆప్‌ ప్రముఖులు అతిశి, కైలాస్‌గెహ్లాట్‌లు కల్కాజీ, నజీఫ్‌ఘర్‌లో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post