దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ఆదేశాలతో సిర్పూర్కర్ కమిషన్ విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులైన నలుగురి ఎన్ కౌంటర్ పై జస్టిస్ వీఎస్. సిర్పూర్కర్ కమిషన్ విచారణ ప్రారంభించింది. హైకోర్టులో కేటాయించిన  కార్యాలయంలో కమిషన్ విచారణను ప్రారంభించింది. ఈ కేసులో ఎన్ కౌంటరయిన నిందితుల కుటుంబాలు విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీనిపై సీబీఐ, లేదా ఇతర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే, దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ కూడా సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్ కౌంటర్ గా చిత్రీకరించారంటూ.. విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం విచారణ కమిషన్ ను నియమించింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post