గ్రామ వాలంటీర్లు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు -మంత్రులు డమ్మీలు అయ్యారు : దేవినేని ఉమ

రాష్ట్రంలో పెద్ద ఎత్తున వృద్ధులు, వికలాంగుల పెన్షన్లను తొలగించారని టీడీపీ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. గ్రామ వాలంటీర్లు బాధ్యతతో వ్యవహరించకుండా… ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటున్నారని అన్నారు. మంత్రులంతా డమ్మీలు అయ్యారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని… ప్రభుత్వం పిచ్చి పరాకాష్ఠకు చేరిందని అన్నారు. ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post