కల్వకుర్తి గ్రంధాలయం సమస్య పై బండి సంజయ్ కి వినతి

కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవా బృందం సభ్యుల ఆధ్వర్యంలో కరీంనగర్ ఎం.పి బండి సంజయ్ గారికి గ్రంధాలయం సమస్య పై శుక్రవారం పట్టణములో వినతిపత్రంతో ఫిర్యాదు చేసారు.సేవా బృందం సభ్యులు మాట్లాడుతూ మద్యం దుకాణాలు ఉండటం చేత పాఠకులకు పుస్తకాలు,పత్రికలు చదవడానికి ఇబ్బంది పడుతున్నారు అని,ముఖ్యంగా మహిళలు రావడమే మానేశారు అని ఆవేదన వ్యక్తంచేశారు. పై అధికారులకు ఎంత చెప్పిన పట్టించుకోకుండా వుండడం చాలా దారుణమైన ప్రభుత్వ పరిపాలన అని అభిప్రాయపడ్డారు.గత నెల క్రిందట ప్రధానికి కూడా ఈ సమస్య పై ఉత్తరం రాసాము, మీ ద్వారా అయిన కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చెయ్యాలి అని కోరారు.ఈ విషయం పై ఎం.పి బండి సంజయ్ మాట్లాడుతూ కచ్చితంగా ఈ సమస్యను సంబంధిత అధికారులకు ఉత్తరం రాసి పరిష్కరిస్తాను అని బండి సంజయ్ తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో ఉపాధ్యక్షుడు మనీష్,సభ్యులు సాయి తేజ,నాయకులు,పట్టణ వాసులు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post