సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించనున్న అమరావతి రైతులు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 53 రోజుల నుంచి ఆ ప్రాంత రైతులు నిరసన తెలియజేస్తుంటే.. మరికొందరు బయట పార్టీలు, నాయకులు, సంస్థల మద్దతు కోరుతూ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి జేఏసీ నేతలు ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో ధర్నా అనంతరం మేడారం జాతరకు బయలు దేరారు. అమరావతిని రాజధానిగా కొనసాగేలా చూడాలని కోరుతూ వనదేవతలకు మొక్కుకోనున్నారు. సమ్మక్క, సారలమ్మలకు ముందస్తు మొక్కులు తీర్చుకుంటారు. ప్రత్యేక బస్సులో బయలుదేరిన వీరు జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post