21 రోజులు ఎవరూ ఇల్లు దాటొద్దు: మోదీ

మహమ్మారి కరోనాపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తున్నామని, ఎవరూ ఇల్లు దాటొద్దని హెచ్చరించారు. ఈ లాక్ డౌన్ నిర్ణయం లక్ష్మణరేఖలా కాపాడుతుందని, 21 రోజుల లాక్ డౌన్ మన ప్రాణాల కంటే ఎక్కువేం కాదని అన్నారు.  ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మన చేతుల్లో ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. ఇది ఎంతో కఠిన నిర్ణయం అయినా, ఎంతో నష్టం తప్పదని తెలిసినా ప్రజాసంక్షేమం దృష్ట్యా తీసుకోకతప్పడం లేదని తెలిపారు. 24 గంటలు పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధుల క్షేమం కోసం ప్రార్థిద్దామని సూచించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post