కరోనా ఎఫెక్ట్.. 3 నెలల పాటు అన్ని రకాల ఎన్నికలు వాయిదా

ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా అన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలు, పలు సాఫ్ట్ వేర్ సంస్థలు, సినిమా థియేటర్స్ ఇప్పటికే మూసివేశారు. బాలీవుడ్, టాలీవుడ్ లలో షూటింగ్స్ కూడా రద్దు చేశారు. ఇక ఈ ‘కరోనా’ కారణంగా ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదాపడ్డాయి. తాజాగా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కూడా ఇదే బాటపట్టాయి. మహారాష్ట్రలో మూడు నెలల పాటు అన్ని రకాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. పశ్చిమ బెంగాల్ లో పురపాలక ఎన్నికలు వాయిదా పడ్డట్టు సమాచారం. ‘కరోనా’ కారణంగా మహారాష్ట్రలోని పూణెలో 144 సెక్షన్ అమలులో ఉండటం గమనార్హం.

0/Post a Comment/Comments

Previous Post Next Post