గన్నేరువరం మండలానికి కోటి 50 లక్షల నిధులు మంజూరు, సీసీ రోడ్లు ప్రారంభించిన ఎంపీపీ లింగాల మల్లారెడ్డి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సాంబయ్య పల్లె గ్రామానికి ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంజూరు చేయగా శుక్రవారం సిసి రోడ్డు ఎంపీపీ లింగాల మల్లారెడ్డి జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గన్నేరువరం మండలానికి కోటి 50 లక్షల నిధులను విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు త్వరలోనే అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ అల్వాల కోటి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సాంబయ్య పల్లె గ్రామ సర్పంచ్ చింతలపల్లి నరసింహారెడ్డి, మాదాపూర్ సర్పంచ్ కుమ్మరి సంపత్, డైరెక్టర్ పురంశెట్టి బాలయ్య, టిఆర్ఎస్ నాయకులు ఏలేటి చంద్రారెడ్డి ,దొడ్డు మల్లేశం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post