దేశంలోని 80 కోట్ల మంది పేదలకు భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలోని పేద ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. లాక్‌డౌన్‌ వల్ల ప్రభావితమైన వారిని ఆదుకునేలా ఈ ప్యాకేజీ ప్రకటిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వలస కార్మికులు, మహిళలు, పేదలకు మేలు చేసేలా ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆమె ప్రకటించారు. గరీబ్‌ కల్యాణ్‌ పథకం పేరుతో ఈ ఆర్థిక ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్యాకేజీని రెండు విధాలుగా అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు నేరుగా సాయం అందిస్తామని తెలిపారు. పేదవారిలో ఏ ఒక్కరూ ఆకలి బాధతో ఉండే పరిస్థితి రానివ్వబోమని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోన్న ప్యాకేజీతో దేశంలోని 80 కోట్ల మంది పౌరులకు లాభం చేకూరుతుందని చెప్పారు. రానున్న మూడు నెలలకు సరిపడా బియ్యం, గోధుమలు కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post