తమిళ హీరో విజయ్ పై ఐటీ దాడుల తరువాత కీలక ప్రకటన !!!!

తమిళ హీరో విజయ్ ఇంట్లో గత నెలలో ఐటీ దాడులు జరిపిన అధికారులు, గత రెండు రోజులుగా మరోసారి దాడులు చేశారు. విజయ్ నటించిన ‘బిగిల్’, ఇప్పుడు నటిస్తున్న ‘మాస్టర్’ చిత్రాలకు సంబంధించిన పారితోషికాలపై ఆరా తీశారు. ‘బిగిల్’ సూపర్ హిట్ కాగా, ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ సమర్పించిన లెక్కల్లో తప్పులు ఉన్నాయని గుర్తించిన ఐటీ శాఖ అధికారులు, ఏజీఎస్ కార్యాలయాలతో పాటు, దానికి రుణమిచ్చిన అన్బు చెళియన్ పైనా దాడులు చేశారు. వాటి ఆధారంగానే గత నెలలో షూటింగ్ లో ఉన్న విజయ్ ని తీసుకెళ్లి, రెండు రోజులు విచారించారు. ఆపై విజయ్ తిరిగి షూటింగ్ లో బిజీ అయిపోగా, మంగళవారం సాయంత్రం నుంచి నిన్న మధ్యాహ్నం వరకూ ‘మాస్టర్’ నిర్మాత లలిత్ కుమార్ ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. ఆపై మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన అధికారులు, విజయ్ వద్ద ఎటువంటి అక్రమ సంపాదనా లేదని స్పష్టం చేశారు. తాను నటించిన సినిమాలకుగాను ఆయన తీసుకుంటున్న పారితోషికానికి సంబంధించిన పన్నులన్నీ సక్రమంగానే చెల్లించారని వెల్లడించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post