ఓవరాక్షన్ చేసిన ఎస్సై పై సస్పెండ్ వేటు - ఎపి డిజిపి

విధి నిర్వహణలో ఓవరాక్షన్ చేసిన పెరవలి ఎస్ఐపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెన్షన్  వేటు వేశారు. చిత్త శుద్ధితో విధులు నిర్వహించడం ఎంత అవసరమో, బాధ్యతగా వ్యవహరించడం కూడా అంతే అవసరమని ఇప్పుడు అర్థమై ఉంటుంది సదరు ఎస్ఐకి. వివరాల్లోకి వెళితే…పశ్చిమగోదావరి జిల్లా  పెరవలిలో ఓ యువకుడు విదేశాల నుంచి వచ్చాడు. అతన్ని ఇంట్లోనే క్వారైంటైన్ (స్వీయ నిర్బంధం)లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు.అయితే అతను నిబంధనలు పక్కన పెట్టి బయటకు రావడంతో పెరవలి ఎస్ఐ కిరణ్ కుమార్ కోపోద్రిక్తుడయ్యారు. బయటకు వచ్చిన అతనిపై లాఠీచార్జి చేశారు. అక్కడే ఉన్న సదరు యువకుడి తండ్రిని కూడా చితకబాదాడు. దీన్ని సమీపంలోని వారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఇది కాస్త వైరల్ అయి డీజీపీ దృష్టికి వెళ్లడంతో గౌతమ్ సవాంగ్ చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించాలి తప్ప దాడిచేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

https://www.youtube.com/watch?v=1KHVx8NsZ-U&t=7s

0/Post a Comment/Comments

Previous Post Next Post