డీజీపీ సవాంగ్, ఐజీ చీఫ్ మనీశ్ తో ఏపీ సీఎం జగన్ అత్యవసర భేటీ!

ఆంధ్రప్రదేశ్ లో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం, అనుమానితుల సంఖ్య పెరగడంపై ఈ ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన తదుపరి చర్యల గురించి చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ మనీశ్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వీరు అంచనా వేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో కేంద్ర హోమ్ శాఖకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసినట్టుగా ప్రచారం జరిగిన లేఖ అంశంపైనా చర్చించారని సమాచారం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమాచారం వెలువడాల్సివుంది.

Previous Post Next Post