దేవస్థానం వద్ద కోళ్ల ఫారం ఏర్పాటుకు అనుమతి ఇవ్వవద్దని ఎంపీపీ కి వినతి

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామ శివారులోని ఒక సర్వే నంబర్ భూమిలో కోళ్ల ఫారం పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్ వరాల పర్షరాములు సభ్యులతో కలిసి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ఎంపీడీవో సురేందర్ రెడ్డికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మల్లికార్జున స్వామి గుట్ట సమీపంలో దుర్గమ్మ గుడి సమ్మక్క సారలమ్మ దేవాలయం కు 500 మీటర్ల దూరంలో కోళ్ల ఫారం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దేవాలయములకు జాతరకు నిత్యం వచ్చే భక్తులకు ఈ కోళ్ల ఫారం నుండి వెదజల్లే దుర్వాసన వలన భక్తులకు ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు ప్రజలు భక్తులను దృష్టిలో పెట్టుకుని కోళ్ల ఫారం నిర్మాణానికి అనుమతి ఇవ్వద్దని కోరారు అలాగే సుడా చైర్మన్ జీవి రామకృష్ణా రావు కు వినతి పత్రం సమర్పించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post