జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిస్తున్న ప్రజలు.. రోడ్లన్నీ ఖాళీ!

కరోనా మహ్మమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు విశేష స్పందన కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. ఒక్క అత్యవసర సేవలు తప్ప మిగతా అన్నీ మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే, అత్యవసర సేవలైన వైద్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, అగ్నిమాపక శాఖ,  ఆసుపత్రులు, పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోలు బంకులు, మీడియా సిబ్బందికి మాత్రం జనతా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఏపీలో అయితే పెట్రోలు బంకులు కూడా మూసివేశారు. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. జనతా కర్ఫ్యూను దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా పాటిస్తూ ఇళ్లలోనే ఉండడంతో దేశం మొత్తం పిన్‌డ్రాప్ సైలెన్స్‌గా మారిపోయింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post