వసాయ సహకార సంఘం చైర్మన్ పదవి ప్రమాణస్వీకరన మహోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే....

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి ప్రమాణస్వీకరన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. రైతు అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ఇప్పటికే రైతులకు 24 గంటల కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు నీళ్లు ఇస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ గ్రామ చెరువులో 365 రోజులు నీళ్లు ఉండేలా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. మరికొన్ని రోజుల్లో మన అంతగిరీ అన్నపూర్ణ ప్రాజెక్ట్ లోకి నీళ్ళు వస్తాయి,అపుడు మన మండలం సస్యశ్యామలం అవుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post