కరోనా ఎఫెక్ట్ - రోడ్ల పై తిరుగుతున్న ఆటోలను సీజ్ చేసిన గన్నేరువరం పోలీసువారు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం:కరోనా మహమ్మారిని పై సమరభేరి మోగించిన ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు రానప్పటికీ సోమవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఆటోలు బైకులు రోడ్లపైకి రావడం స్వయంగా చూసిన గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి రెండు ఆటోలను పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేసినట్లు తెలిపారు ఎస్సై మాట్లాడుతూ ఈనెల 31 తేదీ వరకు రోడ్లపైన ఒకరు ఇద్దరు తప్ప గుమ్మిగూడి ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే అన్ని రకాలైన కిరాణా దుకాణాలు ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని మండలంలోని పెట్రోల్ బంకులు కూడా 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని విటీని ఉల్లంఘించి ఎవరైనా షాప్స్ తెరిచి ఉంచితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post