లోక్‌సభలో ఢిల్లీ అల్లర్లపై కాంగ్రెస్‌ వాయిదా తీర్మానం

ఈశాన్య ఢిల్లీని అట్టుడికించి అ్లర్లపై లోక్‌సభలో చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ  వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. సభలో ఆ పార్టీ పక్ష నేత రంజన్‌ చౌదరి ఈ మేరకు నోటీసును స్పీకర్‌కు అందజేశారు. అలాగే, శివసేన, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఏఐఏంఐఎం, డీఎంకేలు కూడా వేర్వేరుగా నోటీసులు ఇచ్చాయి. ఢిల్లీ అల్లర్లపై మొత్తం 23 నోటీసులు అందడం విశేషం. దీంతో ఈరోజు మొదలైన రెండోవిడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఢిల్లీ అల్లర్లపై చర్చించే అవకాశం ఉంది. హోం మంత్రి అమిత్‌షా రాజీనామాకు కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద ఈరోజు ధర్నా చేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మొత్తం 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

0/Post a Comment/Comments

Previous Post Next Post