జగన్ ఎంతటి అరాచకానికైనా సిద్ధపడతాడు : జగన్ పై ఆలపాటి ఫైర్

శాసనమండలిలో వైసీపీ ఆటలు సాగడంలేదనే అక్కసుతో మండలి రద్దుకు తీర్మానం చేసిన ముఖ్యమంత్రి… ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘాన్ని కూడా రద్దు చేస్తానంటారేమోనని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగ వ్యవస్థలపై జగన్ కు నమ్మకం లేదని మండిపడ్డారు. తాను అనుకున్నది సాధించేందుకు చట్టం, న్యాయం, దేన్నైనా ధిక్కరిస్తారని… ఎంతటి అరాచకానికైనా ఆయన సిద్ధమని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

Previous Post Next Post