పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగ రెండు గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమం

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మండలంలోని హన్మజిపల్లి గ్రామంలో ఎంపీడీవో సురేందర్ రెడ్డి మరియు యాస్వాడ గ్రామంలో ఎంపీఓ నరసింహారెడ్డి సందర్శించారు పలు అభివృద్ధి పనులను గురించి గ్రామస్తులతో చర్చించారు గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డ్, నర్సరీ, వైకుంఠధామం మరియు మిగితా సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు నాయకులతో కలిసి నిద్రించారు ఈకార్యక్రమంలో సర్పంచులు లింగాల రజిత-మహేందర్ రెడ్డి, జక్కన్నపల్లి మధుకర్,ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ మండల నాయకులు న్యాత సుధాకర్, గొల్లపెల్లి రవి, పంచాయతీ కార్యదర్శి ఆనంద్ కంప్యూటర్ ఆపరేటర్ శివ సాయి,శంకర్ టిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post