రేవంత్​ రెడ్డి .. చర్లపల్లి జైలుకు తరలింపు

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ ను డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారన్న ఆరోపణల కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం, ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ ముందు రేవంత్ రెడ్డిని హాజరుపరిచారు. రేవంత్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టు ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు రేవంత్ ను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. అంతకుముందు, గోల్కోండ ప్రభుత్వ ఆసుపత్రికి రేవంత్ ను తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. కాగా, ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనలను ఉల్లంఘించి రంగారెడ్డి జిల్లాలోని మియాఖాన్ గూడ వద్ద డ్రోన్ కెమెరాలను ఉపయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post