బోండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడి చేసింది వైసీపీ గూండానే:టీడీపీ

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై గుంటూరు జిల్లా మాచర్లలో దాడి జరగడంపై పార్టీ వర్గాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమ తదితర సీనియర్ నేతలు ఘటనను తీవ్రస్థాయిలో ఖండించారు. తాజాగా, ఈ దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్త ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. టీడీపీ నేతలపై దాడి చేసిన వ్యక్తి ఆ ఫొటోల్లో సీఎం జగన్, మంత్రులు అనిల్, మేకతోటి సుచరిత, కొడాలి నాని తదితరులతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు చూడొచ్చు. పాదయాత్ర సమయంలోనూ ఆ వ్యక్తి జగన్ వెంటే చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ… మాచర్లలో బుద్ధా వెంకన్న, బోండా ఉమలపై ఈ వైసీపీ గూండానే దాడి చేశాడని వెల్లడించింది. ఉమ, వెంకన్నలపై హత్యాయత్నం చేశాడని ఆరోపించింది.

 

https://twitter.com/JaiTDP/status/1237672675427758080?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1237672675427758080&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-680889%2Ftdp-releases-photos-of-the-attacker-who-dares-on-bonda-uma-and-budda-venkanna-car

0/Post a Comment/Comments

Previous Post Next Post