హైదరాబాద్‌లో పలు ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగ డిక్లర్

కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు కీలక ప్రాంతాలను రెడ్‌జోన్‌ పరిధిలోకి చేర్చింది. చందానగర్‌, కోకాపేట, తుర్కయంజాల్‌, కొత్తపేట ప్రాంతాలను రెడ్‌జోన్‌లో చేర్చిన ప్రభుత్వం ఈ ప్రాంతాల వారు వంద శాతం ఇళ్లకే పరిమితం కావాలని నిర్దేశించింది. పద్నాలుగు రోజులపాటు వీరు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, నిత్యావసరాలు కావాలంటే వారి ఇళ్లకే సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post