ఆత్మహత్య చేసుకున్న ఎస్సై

సీఆర్పీఎఫ్ లో ఎస్సైగా పని చేస్తున్న ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ సీఆర్పీఎఫ్ క్వార్టర్స్ లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్సై భవానీ శంకర్ (30) రాజస్థాన్ కు చెందినవారు. క్వార్టర్స్ లోని విశ్రాంత గదిలో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post