ఖాసీంపేట పాఠశాల ఆవరణంలో నిలిపిన లారీ ఎవరిది ?

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని ఖాసీంపేట గ్రామం ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణంలో గత కొన్ని రోజులుగా అనుమానాస్పదకంగా లారీని నిలిపి వెళ్లారు శనివారం గన్నేరువరం పోలీసులకు ఆ లారీ కంట చిక్కింది గ్రామంలోని సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న యువజనులను లారీ ఎవరిది అని అడిగారు ఎవరికీ తెలియదని సమాధానం చెప్పారు పోలీసులు లారీ బాడీ పై ఎస్ఎల్ఎన్ఎస్ అనే అక్షరాలు అంగ్లంలో ఉన్నాయి లారీ నెంబర్ ఏపీ 29 వి 7869 గల లారీ ఇక్కడ ఎందుకు పెట్టారా అని ఆరా తీస్తున్నారు బాడీ లోపలి భాగములో చూడగా అక్కడక్కడ ఇసుక ఆనవాళ్లు కనిపించాయి రాత్రి వేళల్లో ఇసుక దందా నడిపిస్తున్నరా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో సిసి కెమెరాలు బాగానే పనిచేస్తున్నాయి లారీ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిందో సీసీ కెమెరాల ద్వారా పోలీసులు తెలుసుకోవచ్చు కదా? అని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా లారీ ఎక్కడిది ఎందుకు వచ్చింది అని ప్రశ్నగా మారింది ??? వేచి చూద్దాం.

0/Post a Comment/Comments

Previous Post Next Post