వ్యవసాయ బావిలో అనుమానస్థితిలో పడిఉన్న మృతదేశాలు .... ఆ జిల్లాలో కలకలం రేపుతోంది

చిత్తూరు జిల్లాలో ఓ వ్యవసాయబావిలో నాలుగు మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. పుంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. బావిలో మృతదేహాలు కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ నలుగురిలో ఒకరు మహిళ కాగా, మిగతా ముగ్గురు పదేళ్ల లోపు చిన్నారులు కావడం అక్కడివారిని కలచివేసింది. వారిని తల్లీబిడ్డలుగా భావిస్తున్నారు. ఎక్కడినుంచో వచ్చి ఆ బావిలో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post