హోం మంత్రి సుచరిత ముట్టడించిన వైసీపీ కార్యకర్తలు - రౌడీషీటర్ కు టికెట్ ఇచ్చారంటూ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరితకు సొంత పార్టీలోనే సెగ తగిలింది. వైసీపీ కార్యకర్తలు గుంటూరులోని ఆమె ఇంటిని ముట్టడించారు. ఈ ఉదయం ఆమె ఇంటి వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 27వ డివిజన్ టికెట్ ను రౌడీషీటర్, కబ్జాదారుడైన వ్యక్తికి ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. పార్టీకోసం శ్రమించే యోగేశ్వర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనల నేపథ్యంలో భారీ సంఖ్యలో అక్కడకు చేరకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post