లాక్‌డౌన్ వేళ యథేచ్ఛగా మద్యం విక్రయాలు - రూ.10 లక్షల విలువైన మద్యం సీసాల పట్టివేతలాక్‌డౌన్ వేళ కూడా మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇటువంటి వారి ఆటలు కట్టించేందుకు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శీలం శ్రీనివాస్‌రావు నేతృత్వంలో మేడ్చల్ మండలంలోని వివిధ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళహాట్‌లోని బోయిగూడ కమాన్ వద్ద ఓ మద్యం దుకాణం పక్కనే ఉన్న గదుల్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post