వెంకన్న ఆధ్వర్యంలో 25 కుటుంబాలకు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ


కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట మరియు పారువెల్ల గ్రామాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో జోనల్ చైర్మన్ గంప వెంకన్న  సహకారం తో ఖాసింపేట్  గ్రామంలో నిరుపేద వృద్ధ కుటుంబాలకు దాదాపు 25 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయటం జరిగింది అనంతరం పారువెల్ల గ్రామంలోని కోళ్ల ఫారం లో పనిచేస్తున్న మూడు కుటుంబాలకు ఒక్కొకరి కి 20 కేజీల బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు బూర శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి సభ్యులు గడ్డం సుమీత్ రెడ్డి, లియో సెక్రెటరీ బొజ్జ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post