విద్యార్థి నాయకులు ఆశిక్ సహకారంతో 31వ వార్డ్ నందు శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారునెల్లూరు నగరంలోని 31వ వార్డ్ రాంకోటయ్య నగర్,HK బాబు నగర్,SC కాలనీ మరియు ST కాలనీలలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం మరియు కృష్ణ చైతన్య NSS వాలంటీర్స్ శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు బ్లీచింగ్ పౌడర్, లైం కెమికల్ పౌడర్ కాల్వలలో,రేషన్ షాప్ నందు ప్రజలు ఎక్కువగా గుమ్ముకుడే ప్రదేశంలలో పిచికారీ చేయడం జరిగింది మరియు స్థానిక ప్రజలకి కరోనా వైరస్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.NSS వాలంటీర్స్ నిరవధికంగా ఎండలను సైతం లెక్కచేయకుండా చేస్తున్న సేవ కార్యక్రమాలను గుర్తించి వారికి కాప్స్ మరియు గ్లోవ్స్ లను స్థానిక సమాజ సేవకులు మరియు విద్యార్థి నాయకులు ఆషిక్  గారు అందించి యూనివర్సిటీ NSS సమన్వయకర్త డా.ఉదయ్ శంకర్ గారిని సత్కరించి కృష్ణ చైతన్య కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్ కుమార్ గారికి మరియు వాలంటీర్స్ పార్థు,రాజేష్,చైతన్య,అఖిల్ మరియు రమణలకు కృతజ్ఞతలు తెలియజేశారు
Previous Post Next Post