నెల్లూరు జిల్లాకు చెందిన కుటుంబసభ్యులకు 50 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కూన యాదగిరికరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు కుటుంబసభ్యులు ఐస్ క్రీం సెంటర్ నడుపుతున్న వారికి కరోనా ఎఫెక్ట్ వలన పని చేసుకోలేక ఆకలికి అలమటిస్తూన్నారు ఇంతవరకూ ప్రభుత్వం కిలో బియ్యం ఇవ్వని పరిస్థితి చోటు చేసుకుంది ఆకలి అక్రందనాలు విన్న మండలంలోని చాకలివాని పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కూనవానిపల్లెకు చెందిన కూన యాదగిరి మనసు చలించి 50 కిలోల బియ్యం నిత్యవసర వస్తువులను టిఆర్ఎస్ మండల నాయకులు న్యాత సుధాకర్ చేతుల మీదుగా వారికి అందజేశారు ఇలాంటి వారికి ఈ విపత్కర సమయములో దాతలు స్పందించి వారికి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కూన సంపత్, టిఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు బుర్ర నాగరాజ్, ఇనుకొండ దత్తాత్రి, బూర రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post