కరోనా కాలంలో కూడా రేపులా !.... క్వారంటైన్‌లో ఉన్న మహిళపై సామూహిక అత్యాచారంక్వారంటైన్ లో ఓ మహిళపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపుతోంది. సవాయి మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం ఈ ఘటన చోటుచేసుకోగా... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, జైపూర్ కు చెందిన ఓ మహిళ లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా లాక్ డౌన్ ను ఎత్తేయకపోవడంతో... కాలినడకన ఆమె సొంతూరుకు బయల్దేరింది.గురువారం రాత్రి  ఆమె మాధోపూర్ కు చేరుకోగా... స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉంచారు. దీన్ని అదనుగా తీసుకున్న ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో పాఠశాలకు చేరుకుని ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post