సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ శివారులో దారుణ హత్యసిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ శివారులో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు గుర్తు తెలియని దుండగులు. తలను, కుడి చేతిని నరికి మొండెం నుంచి వేరు చేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు చిన్నకోడూర్ మండలం రామంచ శివారులో ఎల్లంగౌడ్‌ను కొందరు వ్యక్తులు కిరాతకంగా హతమార్చారు.పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

మృతుడిని సిద్దిపేట మండలం ఇమామ్‌బాద్‌కు చెందిన అంబటి ఎల్లంగౌడ్‌ గా పోలీసులు గుర్తించారు. ఎల్లంగౌడ్‌ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఎల్లంగౌడ్‌ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎల్లంగౌడ్ పై పలు కేసులు ఉన్నాయి. గతంలో శామీర్‌‌పేట వద్ద పోలీసులపై కాల్పులు, కానిస్టేబుల్‌ను హత్యకు సంబంధించిన కేసులో ఎల్లంగౌడ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సమాచారం అందిన వెంటనే సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్ ఘటనా స్థలానికి చేరుకుని హత్య ఘటనను పరిశీలించారు.

క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్ధిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు హత్యకు పాల్పడిన నిందితులు సిద్ధిపేట పోలీసులకు లొంగిపోయినట్లుసమాచారం.సిద్దిపేట మండలం తడకపల్లికి చెందిన ఓ వ్యక్తి ఎల్లంగౌడ్‌ను హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.పాత కక్షలే హత్యకు కారణమని తెలుస్తుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post