సీఈసీ రమేశ్ కుమార్‌ తొలగింపుపై హైకోర్టులో పిటిషన్ఎస్ఈసీ పదవి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగించడంపై యోగేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వ జీవోను ఈ పిటిషన్ లో సవాల్ చేశారు. జీవోకు చట్టబద్ధత లేదని యోగేశ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. కొన్నివారాల కిందట ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి రుచించలేదు. దాంతో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఎస్ఈసీ పదవీకాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం రమేశ్ కుమార్ పదవీకాలం ముగియడంతో ఎస్ఈసీగా ఆయనను తొలగించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post