ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ తో సీఎంకు కరోనా పరీక్షలు....జగన్ కు నెగెటివ్దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఆ కిట్లను తన కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, వైద్యులు సీఎం జగన్ కు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ను ఉపయోగించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ సాయంతో కేవలం పది నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ కిట్లను జిల్లాలకు పంపి సామూహిక పరీక్షలు చేపట్టాలన్నది ప్రభుత్వ యోచన. తద్వారా కరోనా వ్యాప్తిని త్వరితగతంగా అరికట్టవచ్చని ఏపీ సర్కారు భావిస్తోంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post