లాక్ డౌన్ విజయవంతం కావాలంటే ప్రభుత్వం పాటించాల్సిన విధివిధానాలు : ప్రింట్ & ఎలక్ట్రానిక్ మిడియా


దేశం లో గాని రాష్ట్రాలలో గాని పూర్తిగా లాక్ డౌన్ విజయవంతం కావాలంటే , కరోనా భారీ నుండి దేశాన్ని , దేశ ప్రజలనుఁ కాపాడుకోవాలంటే , ప్రజలు ఎవరు బయటికి రాకుండా ఉండాలంటే పూర్తిగా కొన్ని ముఖ్యమైన విధివిధానాలను భారత ప్రభుత్వం , రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక పాటించాలి . అప్పుడే మనం తప్పకుండ కరోనా మహమ్మారినుండి బయటపడగలమని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు వి . సుధాకర్ తెలిపారు .
ఆయన మాట్లాడుతూ …పాలకులు తల్లిదండ్రులుగా మారి ప్రజలను పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు , ప్రస్తుతము కొన్ని స్వచ్చంద సంస్థలు వాలంటరీగా పని చేస్తున్నాయి. అలాగే ప్రభుత్వం కూడా దేశం పట్ల దేశ ప్రజల పట్ల పూర్తీ బాధ్యత తీసుకోని ప్రజల కనీస అవసరాలు అనగా ..
1 రేషన్ , కూరగాయలు , మందులు , పాలు మొదలుగునవి డోర్ డెలివరీ చేయగలగాలి.
2 . ప్రతి పదిహేను రోజులకొకసారి గాని లేదా వారం రోజులకొకసారి డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేయగలగాలి అది కూడా ఉచితంగా .
౩ . ఈలోపు ఎవరి కుటుంబంలోనైనా అత్యవసర పరిస్థితి అంటే వైద్య అవసరత ఏర్పడి అతను బయటికి రావలసి వస్తే పూర్తీ భద్రతా కలిగిన మాస్కులు లేదా యాంటీ వైరల్ డ్రస్ ఉచితంగా ఇవ్వగలగాలి .
ఇవి అమలు కావాలన్నా లాక్ డౌన్ ఖచ్చితంగా అమలు కావాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైన కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసి పట్టణ ప్రాంతాలలో నిత్యావసరాలు సరఫరా చేసే సంస్థలు అనగా స్విగ్గి , జొమాటో , బిగ్ బాస్కెట్ లాంటి సంస్థలను కలుపుకొని వారి ద్వారా ప్రభుత్వం సరఫరా చేయడం సులభతరం. అప్పుడే ప్రజలను బయటికి రాకుండా నివారించ గలుగుతాము. ( డోర్ డెలివరీ విధానాన్ని అమలు చేసేటప్పుడు పేద , మధ్యధర , ధనిక కుటుంబాలు ఉంటాయి అలాంటపుడు పేదలకు , అద్దె ఇంట్లో ఉండేవారికి ఉచిత డెలివరీ ఇవ్వగలగాలి , స్వంత ఇల్లు మధ్యధర , ధనికులకు డెలివరీ చార్జెస్ తీసుకుంటే కొంత భారం ప్రభుత్వం మీద తగ్గుతుంది )
గ్రామీణ ప్రాంతాలలో ఐతే ఇటువంటి కాల్ సెంటర్ విధానం అంతగా అవసరం ఉండదు. గ్రామాలలో విఆర్వో,గ్రామ సెక్రటరీ , సిబ్బంది ద్వారా నేరుగా సరఫరా చేయవచ్చు . కాకపొతే ఎండా తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ప్రజలు బయట చెట్ల కింద కూర్చోవడం చేస్తుంటారు అది కూడా నివారించాలంటే కరెంట్ కోత లేకుండా చేయగలిగితే అక్కడ కూడా లాక్ డౌన్ ని విజయవంతం చేయవచ్చు .
లేదంటే ప్రజలు మార్కెట్ అని మందులని , పాలని రోడ్ల మీదికి వస్తున్నారు … బయటికి వస్తున్నా వారిలో చాలా వరకు మాస్కులు పెట్టుకోవడం లేదు , సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు . ఇటు కిరానా షాప్ వారు కానీ లేదా కూరగాయల అమ్మేవారు కానీ కనీస నియమాలు పాటించడం లేదు . బాధ్యతగా వ్యవహరించేవారు అది కొద్దిమంది మాత్రమే కనబడుతున్నారు . ప్రభుత్వం కూడా ఎన్నో కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తుంది , ఏంటో మంది దాతలు కూడా ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు. పోలీసులకు , డాక్టర్లకు మాత్రమే బాధ్యత ఉందని అనుకోకూడదు ప్రజలు , ప్రజలు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిదని, . ప్రతి ఒక్కరు బాధ్యత గ వ్యవహరించాలని , పోలీసులకు కుటుంబాలు ఉన్నాయి , డాక్టర్లకు కుటుంబాలు ఉన్నాయ్ , జర్నలిస్టులకు కుటుంబాలు ఉన్నాయి , ప్రభుత్వ ఉద్యోగులకు కుటుంబాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడని అన్నారు . ముఖ్యముగా జర్నలిస్టుల విషయానికొస్తే టిఏ , డిఏ , జీతాలు లేకుండా కూడా పని చేసేవాళ్ళు ఉన్నరంగా మర్చిపోవద్దని గుర్తు చేసారు .
ఇవన్నీ ప్రభుత్వం ద్వారా జరగలేని పక్షం లో
కోట్ల రూపాయాలు విరాళాలు ఇస్తున్నటువంటి వారు నేరుగా ప్రజలు అందేలా చూడాలి , లేదా ఏడైన స్వచ్చంద సంస్థల ద్వారా వారు ఇస్తున్న విరాళాలకు తగ్గట్టుగా పట్టణాలలో ఉన్నటువంటి పేద ప్రజల ప్రాంతాలలో వారికే నేరుగా నిత్యావసరాలు అందేవిధంగా ప్రయత్నం చేయగలిగితే నేరుగా వారి ఆకలి కడుపుకు ఆకలి తీర్చిన వారు అవుతారు, లెదా ఏదైనా ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి సాయం అదెలా చుడండి . లేదంటే వారు పంపే డబ్బు దళారుల పాలుతుంది . కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చేవాళ్ళు కోట్లు ఇచ్చాం కదా అని తృప్తి పడకూడదు మీరు ఇచ్చే కోట్లలో ఒక్క రూపాయి అయినా ఆకలి కడుపుకు అన్నం పెట్టిందా లేదా అన్నది ముఖ్యం .
కరోనాను నివారించాలనుకుంటే ఈ విధంగా ప్రభుత్వాలు విధివిధానాలు పాటిస్తే చాలా వరకు కరోనా భారీ నుండి దేశాన్ని ప్రజలను కాపాడుకోవచ్చని సుధాకర్ తెలిపారు .

0/Post a Comment/Comments

Previous Post Next Post