నిరుపేదలకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు సోమన్న యువసేన సభ్యులు పంపిణీప్రబలుతున్న కారోన వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  విధించిన  లాక్ డౌన్ మే 7 వరకు పొడిగించడం తో వలస కార్మికులు రోజువారి కూలీలు నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న దృశ్య నాగార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సహకారంతో నాగార్జున నగర్ కాలనీలో నివసించే 200 నిరుపేదలకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు సోమన్న యువసేన సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమన్న యువసేన సభ్యులు మాట్లాడుతూ గత ఇరవై మూడు రోజుల నుంచి పేదలకు అన్నదానము నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయడమే కాకుండా  శుక్రవారం నుండి  జిహెచ్ఎంసి వారు  అప్రూవ్డ్ చేసిన  శనీటైజర్ ను పిచికారీ చేసేందుకు నాలుగు ఆటో ట్రాలీ లను సిద్ధం చేశామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు తిరుమలేష్ నాయకులు సీతారాం రెడ్డి, వీరేశ్, నాను, బబ్బి, మెట్టు, అప్పారావు, నర్సింగ్ రావు, శీను, బాల్ నరసింహ,తిరుపతి, శ్యామరవు, రవీందర్, రవి, గోపి, ఆంజనేయులు తదితరులు పలుగొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post