మాజీ సీఈసీ రమేశ్ కుమార్‌ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసే యోచనతన పదవీ కాలం ఇంకా ఉండగానే ప్రత్యేక ఆర్డినెన్స్‌తో చట్టంలో మార్పుచేసి మరీ తనను పదవి నుంచి తొలగించిన ఏపీ సర్కార్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్న మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. నేడు, రేపు కోర్టుకు సెలువులు రోజులు కావడంతో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.సీఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ జగన్‌ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు నిన్న గవర్నర్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని ఆధారం చేసుకుని పదవీ కాలం ముగిసిందన్న సాకుతో ప్రభుత్వం ఆగమేఘాల మీద నిమ్మగడ్డను తొలగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి కనగరాజును నియమించిన విషయం తెలిసిందే.  

0/Post a Comment/Comments

Previous Post Next Post