వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మెన్ నిజాంఫాషమండలంలోని రఘుపతిపేట్,లింగసానిపల్లి ,గుండూరు. గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ ఛైర్మెన్ నిజాంఫాష ,పాల్గొన్న నాగర్ కర్నూల్ ఎంపీ రాములు ,ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ,అదనపు కలెక్టర్ హన్మంత్ రెడ్డి , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణలో ఎండాకాలంలో కూడా 40 లక్షల పంటలు రైతులు పండించారు అంటే ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందని కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎంపీ రాములు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో 50 లక్షల ఎకరాల పంటల సేద్యం జరిగిందని.ఇందులో 40 లక్షల ఎకరాలు వరి సాగు చేయడం జరిగిందని.రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా లో 222 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని.గతంలో ఎన్నడూ లేనివిధంగా సాగు చేయడం రికార్డు స్థాయిలో జరిగిందని అన్నారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారం గా తయారైందన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోతుగంటి భరత్ ప్రసాద్ గారు, మున్సిపల్ చైర్మన్ సత్యం గారు, ఎంపీపీ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య గారు,పి ఎ సి ఎస్ చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు, సర్పంచ్ లు , ఎంపీటీసీ లు, పి ఎ సి ఎస్ డైరెక్టర్లు, నాయకులు కార్యకర్తలు అధికారులు, రైతులు పాల్గన్నారు.0/Post a Comment/Comments

Previous Post Next Post