మానవతా దృక్పథం తో నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ: కాప్రా టిఆర్ఎస్ నాయకులు నగునూరి మహేష్శుభతెలంగాణ న్యూస్ :(మేడ్చల్ జిల్లా ) కరోనా వైరస్ నేపథ్యంలో కొనసాగుతున్న లాక్ డౌన్ లో భాగంగా ఉపాధి కోల్పోయిన పలు నిరుపేద కుటుంబాలను ఆదుకున్న (TRS) కాప్రా డివిజన్ ఉపాధ్యక్షులు మరియు పోచమ్మ,  విజయ దుర్గ టెంపుల్ కమిటీ చైర్మన్ శ్రీ నాగునూరి మహేష్. మానవతా దృక్పథంతో దాదాపు50 మందికి  శుక్రవారం కాప్రా లోని  గాంధీనగర్ ప్రాంతంలో ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగునూరి  మహేష్ మాట్లాడుతూ  నిరుపేద ప్రజలకు సహాయం చేయడం ఎంతో ఆనందదాయకం అని హర్షం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా ఏదో ఒక రకంగా పని కోల్పోయిన  పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఉపాధి కోల్పోయిన నిరుపేద కోసం భవిష్యత్తులో కూడా వారికీ నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేసి వారిని ఆదుకుంటామని తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post