మహాత్మ జ్యోతిరావు పూలే యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలునాగర్ కర్నూలు జిల్లా  కల్వకుర్తి నియోజకవర్గం లోని  మాచర్ల గ్రామంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా  మార్కెట్ యార్డ్ చైర్మెన్ బాలయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం.డా.బి.ఆర్. అంబేద్కర్  రచించిన భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని వారి  చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని  మనిషి జీవనానికి నీరు.గాలి. ఎంత ముఖ్యమో అభివృద్ధి ,విద్య, సంస్కృతి సంస్కారం, గౌరవం ఒక్క విద్య ద్వారానే ప్రపంచ స్థాయి కి తెలియజేసి నిరూపించిన గొప్ప మేధావి డా.బి.అర్ అంబేద్కర్ అని వారి ఆదర్శలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య పిలుపునిచ్చారు. నేడు అంబేద్కర్  129 వ జయంతి సందర్భంగా మార్చాలా గ్రామంలో  అంబేద్కర్ చౌరస్తాలోని వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దళిత బహుజనుల సామాజిక రుగ్మతలపై అలుపెరుగని పోరాటం చేసారని భారత రాజ్యాంగ రచన ధ్వర ప్రపంచ దేశాలకు దీక్సుచి గా నిలిచారని వారు కొనియాడారు. ఎన్నో అవమానాలు ఓర్చుకొని భారత రాజ్యాంగ నిర్మాతగా నిలిచారని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లయ్య, ఎంపిటిసి సంతోష మల్లేష్, పంచాయతీ సెక్రటరీ లింగం, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, మాజీ ఉపసర్పంచ్ మదన్మోహన్ రావు, కృష్ణ రెడ్డి ,వార్డు సభ్యులు  లింగం కృష్ణయ్య గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post